News January 22, 2026
SRPT: ఇంటివద్దకే పోలీస్ సేవలు

బాధితుల ఇంటి వద్దకే వెళ్లి కేసు నమోదు చేసే వినూత్న కార్యక్రమానికి జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. నడిగూడెం మండలం తెల్లబెల్లిలో భర్త వేధింపులపై ఫిర్యాదు చేసిన దివ్యాంగురాలు రమాదేవి ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కాపీని అందజేశారు. మహిళలు, వృద్ధులకు భరోసా కల్పించేందుకే ఈ ‘డోర్ స్టెప్ ఎఫ్‌ఐఆర్’ అని ఎస్పీ నరసింహ తెలిపారు.
Similar News
News February 21, 2026
260 పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 21, 2026
ఎందుకలా?!: గాలి మనకు కనిపించదు..

ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుందంటే దానిపై కాంతి పడి పరావర్తనం(రిఫ్లెక్షన్) చెందిందని అర్థం. అటు ఏ పదార్థం/వస్తువు ఏర్పడాలన్నా అణువుల కలయిక అవసరం. అయితే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ అణువులున్నా కనిపించకపోవడానికి కారణం వాటి నిర్మాణం. అవి చాలా సూక్ష్మంగా, పారదర్శకంగా ఉంటాయి. దీంతో వాటిపై కాంతి పడినా రిఫ్లెక్ట్ చేయలేవు. ఫలితంగా గాలిని చూడలేం. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.
News February 21, 2026
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

చలి తీవ్రత పెరిగిన ప్రస్తుత తరుణంలో మిరప పంటలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.


