News March 5, 2025

SRPT: ఇద్దరు RIలను సస్పెండ్ చేసిన కలెక్టర్

image

మోతే తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసిన ఇద్దరు ఆర్‌ఐలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. మోతే మండల ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న జే.నిర్మలదేవి, అదనపు ఆర్‌ఐ షేక్ మన్సుర్ అలీలు పాత పహాణిలను సస్పెండ్ చేశారు. రికార్డులలో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్లు కింద 11 దరఖాస్తులు చేపించి భూమి ఉన్నట్టు తప్పుడు ధ్రువీకరణ సృష్టించారని అన్నారు.

Similar News

News September 13, 2025

NLG: రజాకార్ల మారణకాండకు 79 ఏళ్లు

image

రజాకారులు సృష్టించిన మారణ హోమానికి సజీవ సాక్ష్యం వల్లాల గ్రామం. 1948 ఆగస్టు15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ పాఠశాలలో పది మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తుండగా గ్రామంపై దండెత్తిన రజాకారులు అమానుష హత్యాకాండకు తెగబడ్డారు. పాఠశాల ప్రాంగణంలోనే పది మందిని తుపాకీతో కాల్చి చంపిన ఘటనకు 79 ఏళ్లు నిండాయి.

News September 13, 2025

SRSPకి వరద.. 22 గేట్ల ద్వారా నీరు విడుదల

image

ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఎగువ నుంచి 82,395 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 22 వరద గేట్ల ద్వారా 64,680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. IFFC ద్వారా 8 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 800, ఎస్కెప్ గేట్ల ద్వారా 8,000, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News September 13, 2025

NZB: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 3 ఏళ్ల జైలు

image

వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి NZB 4వ అడిషనల్ మహిళ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. రెంజల్ మండల కేంద్రానికి చెందిన గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న పక్క ఇంట్లో నివసించే వివాహిత ఒంటరిగా ఉండగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడికి చేరుకుని కిరణ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు.