News January 26, 2025
SRPT: కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన పాలనాధికారి

సూర్యాపేట కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వివిధ శాఖల అధికారులతో కలిసి జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొంది గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు. స్వాతంత్య్రోద్యమంలో యోధుల త్యాగాలను, వారి ఆశయాలను గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.
Similar News
News November 3, 2025
VJA: వన్ హెల్త్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణ లక్ష్యంగా ఒకే ఆరోగ్యం (వన్ హెల్త్) అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రారంభించారు. ప్రతి ఏటా నవంబర్ 3న వన్ హెల్త్ డే జరుపుకుంటారని చెప్పారు.
News November 3, 2025
జాప్యం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియ పాల్గొన్నారు. అందిన మొత్తం 194 ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించి, పౌరుల సంతృప్తిని నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. సరైన కారణం లేకుండా జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 3, 2025
వైఫల్యం చెందిన అధికారిపై చర్యలు: కలెక్టర్

సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 454 అర్జీలు అందాయని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ప్రజా సమస్యలను కేటాయించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆమె ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలకు రీఓపెన్ లేకుండా పరిష్కరించాలని, వైఫల్యం చెందిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


