News October 26, 2025
SRPT: కాంగ్రెస్ విధేయుడు అన్నెపర్తికే DCC పగ్గాలు?

సూర్యాపేట DCC అధ్యక్ష పదవి తుంగతుర్తికి చెందిన విధేయుడు అన్నెపర్తి జ్ఞానసుందర్‌కే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 30-40 ఏళ్లు కాంగ్రెస్‌ను నమ్ముకుని, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రజా పోరాటాలు చేయడంలో ముందున్నారు.. పదేళ్లు అధికారం లేకున్నా పార్టీని వీడకుండా పనిచేసిన ఆయనకు పగ్గాలు అప్పగిస్తే కలసివస్తుందని అభిప్రాయపడుతున్నాయి. తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లో ఉంది.
Similar News
News October 26, 2025
రంగారెడ్డి: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ యూనిట్‌లో 138 లిక్కర్ షాపులకు 7,761 దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్‌లో 111 షాపులకు 8,306 మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.482.01 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రేటర్ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం.
News October 26, 2025
తీర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు: DMHO

తుపాను నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతాల మండలాలలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్లు DMHO విజయమ్మ చెప్పారు. ఆదివారం బాపట్ల జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీ సెంటర్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు మొబైల్ మెడికల్ టీంలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఆస్పత్రులు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు.
News October 26, 2025
ఇతిహాసాలు క్విజ్ – 47 సమాధానాలు

1. దశరథ మహారాజు కుల గురువు ‘వశిష్ఠుడు’.
2. ఉలూచి, అర్జునుల కుమారుడు ‘ఇరావంతుడు’.
3. దేవతల తల్లి ‘అధితి’.
4. శివుడు నర్తించే రూపం పేరు ‘నటరాజ’.
5. సత్య హరిశ్చంద్రుడి భార్య పేరు ‘చంద్రమతి’.
<<-se>>#Ithihasaluquiz<<>>


