News April 6, 2025
SRPT: కారు ఢీకొనడంతో.. యువతి మృతి

సూర్యాపేట జిల్లా రాయినిగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందారు. మృత్యురాలు 7R హోటల్‌లో పని చేయడానికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News April 7, 2025
మంచిర్యాలలో ఏడుగురు అరెస్ట్

మంచిర్యాలలోని తిలక్‌నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చెట్ల పొదల్లో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో గోదార్ల రమేష్, దేవసాని కుమార్, ఆటకారి శ్రీను, వనం లక్ష్మన్, మాచర్ల వెంకటేష్, తోకల శ్రీనివాస్, గౌరీ ప్రసాద్ ఉన్నారు. వారి నుంచి రూ.2,100 నగదు, 4 మొబైల్స్, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
News April 7, 2025
మాజీ రైజర్సే దెబ్బ కొట్టారు!

GT నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మాజీ ఆటగాళ్లు గట్టి దెబ్బ తీశారు. గత సీజన్ వరకూ SRHలోనే ఉన్న వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లోనే 49 రన్స్‌తో లక్ష్య ఛేదనను సులువుగా మార్చేశాడు. అటు ఒకప్పటి రైజర్ సిరాజ్ బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. వీరిద్దరూ మన వద్ద ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఆడలేదంటూ నెట్టింట సన్‌రైజర్స్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
News April 7, 2025
కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.