News February 25, 2025
SRPT: గుండెపోటుతో వ్యక్తి మృతి

తుంగతుర్తిలో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన కటకం వెంకన్న (55) కొన్ని సంవత్సరాలుగా బ్రిక్స్, వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో షెడ్డులో పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 26, 2025
రంజాన్ ప్రశాంతంగా జరుపుకోవాలి: ASF కలెక్టర్

రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ, ముస్లిం మత పెద్దలు, మస్జిద్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పవిత్రమైన రంజాన్ మాసాన్ని ప్రశాంత వాతావరణంలో అందరూ పవిత్రంగా జరుపుకోవాలన్నారు. జిల్లాలో ప్రతి మస్జిద్ దగ్గర పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు.
News February 26, 2025
వరంగల్: రైతన్నలు సిద్ధంగా ఉన్నారు: మాజీ MLA

రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మిర్చి పంట ధరలు పడిపోయి రైతన్నలు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఎనుమముల మార్కెట్‌ను సందర్శించి రైతన్నల కష్టాలను అడిగి తెలుసుకున్నామన్నారు.
News February 26, 2025
తొర్రూరులో వైన్ షాప్ నిర్వాహకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో ఎన్నికల కోడ్‌ను వైన్ షాప్ నిర్వాహకులు ఉల్లంఘించారని స్థానికులు తెలిపారు. వైన్ షాప్ నిర్వాహకులు ఎన్నికల సమయపాలనకు తూట్లు పొడిచారన్నారు. ఎన్నికల అధికారులు కూడా చూసీ చూడనట్టుగా ఉండడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాప్‌లు మూసివేయాల్సి ఉండగా, సీల్ వేసిన వైన్ షాప్‌ను మళ్లీ తెరిచి కొనసాగించడం ఏంటని చర్చించుకుంటున్నారు.