News September 12, 2025

SRPT: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ గురువారం కోరారు. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్నీ కేసుల్లో కక్షిదారులు రాజీ పడవచ్చన్నారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి రాజీమార్గమే రాజమార్గమన్నారు. ఇందుకు లోక్ అదాలత్ ఓ మంచి వేదికన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 12, 2025

HYD: వాట్సాప్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదుదారులకు ఎఫ్‌ఐఆర్‌ను వాట్సాప్‌లో పంపించే సరికొత్త విధానానికి సీపీ అవినాష్ మహంతి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో పోలీసు సేవలు పారదర్శకంగా ఉండటంతో పాటు, ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.

News September 12, 2025

350 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పుణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వివిధ కేటగిరీల్లో 350 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.1,180(SC / ST / PwBDలకు రూ.118). పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిగ్రీ, లా డిగ్రీ, ఉగ్యోగానుభవం ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>https://bankofmaharashtra.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News September 12, 2025

గట్టు: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..!

image

గట్టు మండలం ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్ శుక్రవారం గట్టు సల్కాపురం గ్రామాల మధ్య పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వ్యాన్‌లో 20 మంది విద్యార్థులు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వ్యాన్ వరి పొలంలో కూరుకుపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు అంటున్నారు.