News January 28, 2025
SRPT: దివ్యాంగ మహిళ పూలమ్మకు న్యాయం జరిగేనా!

మోతె మండలంలోని నామవారం శివారులో 7 ఎకరాల 10 గుంటల భూమిని మోతె తహశీల్దార్ సంఘమిత్ర అక్రమంగా పట్టా చేశారని దివ్యాంగ మహిళ పూలమ్మ ఆరోపించిన సంగతి తెలిసింది. ఆధారాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆమె నిరసన తెలుపుతున్నారు. ఆమెకు న్యాయం జరగాలని పలువురు కోరుకుంటున్నారు.
Similar News
News November 4, 2025
VZM: విజేతలను అభినందించిన ఎస్పీ

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులను తన కార్యాలయంలో SP దామోదర్ అభినందించారు. ప్రథమ బహుమతిగా రూ.2వేలు, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయంగా రూ.1000 చొప్పున నగదు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన పెంపొందించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలని సూచించారు.
News November 4, 2025
గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో పీఎం ఉజ్వల యోజన కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భైర్లూటి గూడెం, గులాం అలియాబాద్ తాండాలలో ఏర్పాటైన నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
News November 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>


