News March 15, 2025

SRPT: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా శనివారం (నేడు) నుంచి సూర్యాపేట జిల్లాలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్ స్కూల్స్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్‌ డే స్కూల్స్ ఉంటాయి. అటు ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News January 10, 2026

సినిమా టికెట్లేనా.. స్కూల్ ఫీజులు, ఆస్పత్రుల దోపిడీ సంగతేంటి?

image

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల పెంపు, కోర్టుల్లో కేసులు, వివాదాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే భారీగా ఉన్న స్కూల్ ఫీజులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బిల్లులు, రవాణా ఛార్జీలు తగ్గించాలని ఎవరూ ఎందుకు అడగట్లేదని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీటి వల్ల ఎక్కువ మందిపై భారం పడుతోందని, సినిమా టికెట్ల కంటే వీటిపై చర్చ ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ COMMENT?

News January 10, 2026

ఇండియన్ సినీ చరిత్రలో ప్రభాస్ ఒక్కడే!

image

రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారు. నిన్న రిలీజైన ‘రాజాసాబ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.112 కోట్లు రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో 6 చిత్రాలకు (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజాసాబ్) రూ.100 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక నటుడిగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. ప్రభాస్ ‘సిక్స్’ కొట్టి ‘బాక్సాఫీస్ బాద్‌షా’గా నిలిచారంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

News January 10, 2026

పెద్దపల్లి: క్రీడా స్ఫూర్తి చాటేలా ‘సీఎం కప్‌’ ర్యాలీ

image

పెద్దపల్లి జిల్లాలో సీఎం కప్‌-2025 (రెండో విడత) ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమైంది. ఈనెల 12న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో టార్చ్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ.సురేశ్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ వరకు సాగే ఈ ర్యాలీలో ఎమ్మెల్యే, కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు.