News February 22, 2025
SRPT: ‘పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్లో DEO అశోక్‌తో కలిసి జిల్లాలోని హై స్కూల్ హెడ్ మాస్టర్లు, మండల విద్యాధికారులు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.
Similar News
News December 26, 2025
బిందు సేద్యం.. ఈ జాగ్రత్తలు తీసుకుందాం

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్‌లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్‌లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్‌ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.
News December 26, 2025
కలెక్టర్, ఎస్పీతో సమావేశమైన బాపట్ల ఎంపీ

లోక్‌సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, శాంతిభద్రతల పరిరక్షణపై ఎంపీ సుధీర్ఘంగా చర్చించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
News December 26, 2025
రేపే రాజాసాబ్ ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్

మారుతీ-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. HYDలో రేపు సా.5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.


