News April 1, 2025

SRPT: పొట్టకూటి కోసం వెళ్తే మృత్యువు వెంటాడింది

image

పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన వృద్ధురాలిని కారు రూపంలో మృత్యువు కాటేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఆలువల స్వరాజ్యం(60) కూలి పని కోసం ఆటోలో కుంటపల్లికి వచ్చింది. ఆటో దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.

Similar News

News April 2, 2025

IPL: టాస్ గెలిచిన GT

image

RCBతో మ్యాచులో టాస్ గెలిచిన GT బౌలింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, రజత్(C), లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్
GT: గిల్(C), బట్లర్, సుదర్శన్, ఇషాంత్ శర్మ, షారుఖ్ ఖాన్, తెవాటియా, సాయి కిశోర్, రషీద్ ఖాన్, అర్షద్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

News April 2, 2025

PPM: రెవెన్యూ సదస్సుల్లో 99.34 శాతం పూర్తి

image

జిల్లాలో 6,246 రెవెన్యూ సదస్సులకు గాను 6,205 సదస్సులను చేపట్టి 99.34 శాతం మేర పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అడిషనల్ సీసీఎల్ఎకు వివరించారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్, రెగ్యులరైజేషన్, నీటి పన్ను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో అడిషనల్ సీసీఎల్ఎ, సెక్రటరీ డా. ఎన్.ప్రభాకరరెడ్ది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News April 2, 2025

VJA: ప్ర‌త్యేక గుర్తింపునకు భాగ‌స్వాములుకండి: కలెక్టర్

image

విజ‌య‌వాడ న‌గ‌రానికి బ్రాండ్ ఇమేజ్ టైటిల్‌, ట్యాగ్‌లైన్‌ను ఆహ్వానిస్తూ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. భౌగోళికంగా, చారిత్ర‌కంగా విద్య‌, వైద్య, పారిశ్రామిక‌, సాంస్కృతిక, క‌ళా రంగాల్లో గుర్తింపు పొందిన విజ‌య‌వాడ న‌గ‌రం రాజ‌ధాని అమ‌రావ‌తికి ముఖ‌ద్వారం కావ‌డంతో మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంద‌న్నారు. 

error: Content is protected !!