News April 15, 2025
SRPT: పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్‌పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.
Similar News
News November 11, 2025
9 మంది యువకులపై బైండోవర్ కేసులు

కదిరిలో గంజాయి తాగుతున్న యువకులపై దాడులు చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం వీరిపై బైండ్ ఓవర్ కేసులు నమోదుచేసి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. మంగళవారం తహశీల్దార్ ముందు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఫైన్ విధించి, బైండ్ ఓవర్ చేయనున్నట్లు వివరించారు. గంజాయిని వాడే 17 ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ఓటేస్తేనే అడిగే హక్కు..!

భారత రాజ్యాంగం మనకు ఓటు అనే వజ్రాయుధాన్ని ఇచ్చింది.. దానిని మీ వద్దే ఉంచుకుంటే ఎలా? ఇప్పుడు బయటకు తీయండి. మా ఏరియాలో ఆ సమస్యలు ఉన్నాయి.. ఈ సమస్యలున్నాయి.. ఎవరూ పట్టించుకోరు అని చాలా మంది నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు కూడా అలా చేసి ఉంటారు. ఇటువంటి ఎన్నికల సమయంలో మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి.. లేకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి.. మనల్ని పట్టించుకునే వారే ఉండరు. ఓటేసేందుకు కదలిరండి.
News November 11, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 11, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


