News March 4, 2026
SRPT: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ

మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన ఘోర <<19298055>>కారు ప్రమాద స్థలాన్ని<<>> ఎస్పీ నరసింహ బుధవారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు యువకులు మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రయాణాల్లో వాహనదారులు నిబంధనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
Similar News
News March 10, 2026
దేశంలోనే 3rd రిచెస్ట్ మహిళా ఎమ్మెల్యేగా లోకం మాధవి

మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోనే టాప్-10 రిచెస్ట్ మహిళా MLA, MPల లిస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మన నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి రూ.291 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అదేవిధంగా కోవూరు MLA ప్రశాంతి రెడ్డి రూ.716 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. కడప MLA రెడప్ప గారి మాధవి రూ.388 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. మొదటి మూడు స్థానాల్లో ఏపీ ఎమ్మెల్యేలే ఉండటం విశేషం.
News March 10, 2026
గ్యాస్ నిల్వలు తగ్గకుండా కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చమురుశుద్ధి సంస్థలపై Essential Commodities Act ప్రయోగించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. LPG ఉత్పత్తి పెంచాలని ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదేశించింది.
News March 10, 2026
NTR: రేషన్ డాన్‌పై చర్యలు లేనట్లేనా..?

తిరువూరు నియోజకవర్గ కేంద్రంగా పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా కొనసాగుతుంది. మునుకుళ్లకు చెందిన రేషన్ డాన్ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతినెలా 150 టన్నులకు పైగా సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పట్టిస్తూ రూ.కోటి పైగా ఆర్జిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పలుమార్లు పట్టుబడిన రేషన్ డాన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.


