News October 17, 2025

SRPT: మీరాబాయి వేషంలో వచ్చి.. పాఠం బోధించి

image

విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేందుకు ఓ ఉపాధ్యాయురాలు విచిత్ర వేషధారణతో ఆకట్టుకున్నారు. తుంగతుర్తి(M) వెలుగుపల్లి ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు కర్పూరపు నివేదిత.. 10వ తరగతిలో మీరాబాయి రచించిన ‘భక్తిపథ్‌’ పాఠం బోధించేందుకు మీరాబాయి వేషంలో తరగతి గదికి వచ్చారు. టీచర్‌ను చూసి మొదట అవాక్కైన విద్యార్థులు.. కాసేపటికి గుర్తుపట్టి ఆశ్చర్యపోయారు. ఆమె వినూత్న బోధనను అందరూ అభినందించారు.

Similar News

News October 17, 2025

మహిళల కోసం ఇన్ఫోసిస్ కొత్త ప్రోగ్రామ్

image

కనీసం 6 నెలల కెరీర్‌ గ్యాప్ వచ్చిన మహిళా నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు ఇన్ఫోసిన్ ముందుకొచ్చింది. ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ ఇనిషేటివ్’ పేరుతో గత నెల కొత్త రిఫరల్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులైన మహిళలను రిఫర్ చేయొచ్చు. వారు జాబ్‌కు ఎంపికైతే లెవెల్-3లో రూ.10వేలు, లెవెల్-4లో రూ.25వేలు, లెవెల్-5లో రూ.35వేలు, లెవెల్ 6లో రూ.50వేల వరకు రివార్డులు అందించనుంది.

News October 17, 2025

646 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే సమయం

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌)లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే (OCT 20) సమయం ఉంది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cdac.in

News October 17, 2025

కాజీపేట: అందుబాటులోకి ప్రత్యేక పర్యాటక రైలు..!

image

ప్రత్యేక పర్యాటక రైలును అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే మేనేజర్ వెంకటేశ్ తెలిపారు. KZPలో ఈ రైలు యాత్ర ఈ నెల 26 నుంచి నవంబరు 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ద్వారకాదీష్ మందిరం, నాగేశ్వర జ్యోతీర్లింగ మందిరం, భేట్ ద్వారక, సోమ నాథ్ జ్యోతిర్లింగ మందిరం, సబర్మతి ఆశ్రమం సందర్శన, సూర్య దేవాలయం, రాణికి వావ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) సందర్శించవచ్చని చెప్పారు.