News February 4, 2026
SRPT: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: SP

నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలు సవ్యంగా, నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పోలీస్ శాఖ నూతనంగా చేపట్టిన ఇంటి వద్ద నుంచే ఎఫ్ఐఆర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News February 5, 2026
HYD: ఒక్క లైవ్ బటన్‌తో పది లక్షల చీరలు

ఒక్క లైవ్ బటన్‌తో 10 లక్షల చీరలు అమ్మడం మామూలు మాట కాదు! టీచర్‌గా పనిచేసిన సంగీత రాజేశ్, ఫేస్‌బుక్ లైవ్‌లో డిజిటల్ ‘సారీ క్వీన్’గా అవతరించారు. 8.5లక్షల మంది ఫాలోవర్ల సాక్షిగా, నేతన్నల నైపుణ్యాన్ని గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేశారు. ఒక్కో మారథాన్ షోలో ₹50 లక్షల వ్యాపారం చేస్తూ, బంజారాహిల్స్‌లో ఎంపోరియం నిర్మించినా.. ఆవిడ గురి లైవ్ సేల్స్ పైనే. ISB చదువు, సంప్రదాయం కలిస్తే సంచలనాలేనని నిరూపిస్తున్నారు.

జగన్.. అల్లర్ల రాజకీయాలకు స్వస్తి పలకండి: అచ్చెన్నాయుడు

AP: జగన్ గుంటూరు పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. ‘తాడేపల్లి నుంచి గుంటూరుకు ప్రయాణం 9 గంటల పాటు సాగదీయడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇలా మీరు రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించాలని చూడటం సరికాదు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే రోడ్లపై డ్రామాలు ఆపి ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి. దమ్ముంటే సభలో చర్చిద్దాం. ఇకనైనా అల్లర్ల రాజకీయాలకు స్వస్తి పలకాలి’ అని సూచించారు.