News March 20, 2025
SRPT: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ఆహ్వానం

SRPT జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5 వరకు http://tgobmmsnew.cgg.gov.inలో అప్లై చేసుకుంటే అర్హులైన వారి జాబితాను జూన్ 02న ప్రకటించి, ఒక్కొక్క నియోజకవర్గాలలో సుమారు 4 నుంచి 5వేల యూనిట్లు మంజూరు చేయనున్నారు అని అన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.
Similar News
News March 20, 2025
YCP MLAలు దొంగచాటుగా సంతకాలు పెడుతున్నారు: అయ్యన్న

AP: YCP సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీ MLAలు దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలు అడుగుతున్నారే తప్ప సభకు రావట్లేదన్నారు. దొంగచాటుగా, దొంగల మాదిరి వచ్చి సంతకాలు పెట్టడం ఏంటి? అని నిలదీశారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలని సూచించారు.
News March 20, 2025
సూర్యాపేట: త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లు

సూర్యాపేట జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో 4,140 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారులకు మేలు జరగనుంది. జిల్లాలో ఈ పథకానికి 3,09,062మంది దరఖాస్తు చేసుకున్నారు.
News March 20, 2025
ఆదిలాబాద్: రేపటి నుంచి పది పరీక్షలు.. 52 కేంద్రాలు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షల కోసం మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10,106 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు 5058, బాలికలు 4993, మొత్తం 10051 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144, 163 అమలు చేసి పకడ్బందీగా చేపట్టనున్నారు.