News January 26, 2025
SRPT: 50 ఏళ్లకు.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సూర్యాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 1975-76లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా 65 ఏళ్ల వయసులో ఉన్న ఆ స్నేహితులు గత స్మృతులను గుర్తు చేసుకొని సందడి చేశారు. తమ మనవళ్లు చేసుకునే సమ్మేళనం తాము చేసుకుంటున్నాం అంటూ ఆనందంగా గడిపారు. 50 ఏళ్లయినా స్నేహానికి వయసు లేదని చెబుతున్నారు.
Similar News
News November 17, 2025
Wow.. సిద్దిపేట నుంచి ఇండియా టీంకు

అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్‌బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్‌తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.
News November 17, 2025
బుడితి: ఈ హాస్పిటల్‌లో ఏం జరుగుతుంది.. గర్భిణుల మృతితో అలజడి

అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి.. ఇటీవల కాలంలో ఆ హాస్పిటల్లో గర్భిణులు శస్త్ర చికిత్స అనంతరం మృతి చెందడం కొనసాగుతుంది. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సారవకోట మండలం బుడితి సీహెచ్సీలో గతంలో ఒకేరోజు ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. తాజాగా శనివారం మరో గర్భిణి మృతి చెందింది. దీనిపై అధికారులు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.
News November 17, 2025
వరంగల్, హనుమకొండను కలిపి ఒకే జిల్లా?

WGL, HNKను కలిపి ఒకే జిల్లాగా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు నగరాన్ని ఒకే జిల్లాగా మార్చాలంటూ పదే పదే వేదికల మీద BRSని విమర్శిస్తుండటం తెలిసిందే. ఈ మేరకు గ్రేటర్ WGLను ఒకే జిల్లాగా చేసి, మిగిలిన ప్రాంతాన్ని మరో జిల్లాగా కొనసాగించాలనే నిర్ణయంతో డ్రాఫ్టును జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.


