News August 9, 2024
SRPT: GREAT.. 4 GOVT JOBS సాధించింది!

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతదొనబండ తండా వాసి భూక్యా మౌనిక ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె HYD దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ స్థానికంగా ఉండే పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఆమె చదువుకుంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఆరో ర్యాంకు, TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ AEE, 2023లో రైల్వేలో క్యారేజ్ అండ్ వ్యాగన్, లెవల్-3లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ జాబ్స్ సాధించింది.
Similar News
News March 10, 2026
నల్గొండ: పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్

జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూసేకరణలో జాప్యం లేకుండా చూడాలని, ప్రాజెక్టులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ అమిత్, ఆర్డీవోలు పాల్గొన్నారు.
News March 10, 2026
గంజాయి సేవిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి: SP శరత్ చంద్ర

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ స్థాయిలో రహదారి భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకొని రోడ్డు ప్రమాదాల విషయాలపై చర్చించాలని ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు. నకిరేకల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి సమాచారం తెలిస్తే తక్షణమే 8712670266 నంబర్‌కి ఫోన్ చేసి తెలియజేయాలని, గత సంవత్సరం జిల్లాలో 53 గంజాయి కేసులు నమోదు చేశామని తెలిపారు.
News March 10, 2026
రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి: ఎస్పీ శరత్ చంద్ర

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన ‘సురక్షితంగా చేరుకోండి’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో 400గా ఉన్న ప్రమాదాల సంఖ్యను 2025 నాటికి 360కి తగ్గించామన్నారు. మరణించిన వారిలో 50 శాతం ద్విచక్ర వాహనదారులేనని, హెల్మెట్ లేకపోవడం వల్లే 90 శాతం ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.


