News April 5, 2025
SRPT SP కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ నరసింహ బాబూ జగ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Similar News
News December 13, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

హ్యాండ్లూమ్, టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్కు సంబంధించిన పరీక్షలను జనవరిలో నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా ఆయా విభాగాలకు సంబంధించిన నిర్దేశించిన ఫీజులను ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరారు.
News December 13, 2025
ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
News December 13, 2025
Way2News కథనానికి స్పందించిన సీతక్క

ఏటూరునాగారంలోని రామన్నగూడెం రోడ్డు 7వ వార్డులో వైన్ షాపు ఇళ్ల మధ్య ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం <<18545026>>’మానాభిమానాల కంటే వైన్ షాపు ముఖ్యమా..?’ <<>>అనే శీర్షికతో Way2Newsలో కథనం ప్రచురించగా మంత్రి సీతక్క స్పందించారు. నివాసాల మధ్య వైన్ షాపును ఏర్పాటు చేయొద్దని ఎక్సైజ్ శాఖకు సూచించారు. దీంతో స్థానికులు, సీతక్కకు, Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.


