News April 5, 2025

SRPT SP కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

image

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్ 118వ జయంతి వేడుకలు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ నరసింహ బాబూ జగ్జీవన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల ‌అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Similar News

News April 13, 2025

మహాయుతి కూటమిలో విభేదాలు?

image

మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తాయని ప్రచారానికి తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన బలం చేకూరుస్తుంది. ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా NCP ఎంపీ సునీల్ తత్కరీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొనగా శివసేన నేతలెవరూ హాజరుకాలేదు. కాగా తాను ఆహ్వానించినప్పటికీ నేతలెవరూ విందుకు రాలేదని NCP ఎంపీ అన్నారు. దీంతో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమిలో ముసలం పుట్టిందని వార్తలు ప్రచారమవుతున్నాయి.

News April 13, 2025

సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

image

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలకు కొండమీదకు అనుమతి లేదని, ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.

News April 13, 2025

మ్యాచ్ చూడటం ఆనందంగా ఉంది: GHMC మేయర్

image

శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో SRH మ్యాచ్‌ను చూడటం ఆనందంగా ఉందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఆ మ్యాచులో అభిషేక్‌శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఎంతో మందికి గుర్తుండిపోతుందన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు మేయర్‌తో పాటు కే.కేశవరావు వచ్చారు.

error: Content is protected !!