News April 5, 2025

SRPT SP కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

image

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్ 118వ జయంతి వేడుకలు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ నరసింహ బాబూ జగ్జీవన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల ‌అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Similar News

News April 14, 2025

NGKL: డీఎస్పీ నుంచి బీఎస్పీలోకి చేరికలు

image

BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మిద్దె శివప్రసాద్ (నాగర్ కర్నూల్), పంజుగుల శంకర్ (కల్వకుర్తి), మల్లెపాకుల సైదులు (అచ్చంపేట) ధర్మ సమాజ్ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో సోమవారం చేరారు. మంద ప్రభాకర్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్ దయానందరావు, రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ, అంతటి నాగన్న తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2025

IPL: టాస్ గెలిచిన చెన్నై

image

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు లక్నోలో CSKతో LSG తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో CSK కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తెలుగు ప్లేయర్ రషీద్ CSKలో ఈరోజు ఆడనున్నారు.
CSK: రచిన్, రషీద్, త్రిపాఠీ, విజయ్ శంకర్, ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్, కాంబోజ్, ఖలీల్, పతిరణ
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, దిగ్వేశ్, ఆవేశ్

News April 14, 2025

VKB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలకు వరం: స్పీకర్

image

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు వరంగా మారాయని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!