News April 6, 2025

SRPT: కారు ఢీకొనడంతో.. యువతి మృతి

image

సూర్యాపేట జిల్లా రాయినిగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందారు. మృత్యురాలు 7R హోటల్‌లో పని చేయడానికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News April 9, 2025

తెనాలిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

image

ఇతర ప్రాంతాల నుంచి తెనాలికి గంజాయి తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్న నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రమేశ్ బాబుతో కలిసి డీఎస్పీ జనార్ధనరావు నిందితుల వివరాలను తెలిపారు. గుంటూరుకు చెందిన రాజశేఖర్ రెడ్డి ,పేరేచర్లకు చెందిన అరుణ్ కుమార్, తెనాలికి చెందిన ప్రకాశ్ బాబు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుండగా అరెస్టు చేసి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News April 9, 2025

సంగారెడ్డి: ’11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి’

image

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమం ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ బుధవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆర్అండ్ బీ కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అనంతరం కల్వకుంట రోడ్‌లో సభ జరుగుతుందని పేర్కొన్నారు . ప్రజా ప్రతినిధులు, దళిత, బీసీ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.

News April 9, 2025

సాలార్జంగ్ మ్యూజియంలో అంబేడ్కర్ ఫొటో ఎగ్జిబిషన్

image

సాలార్జంగ్ మ్యూజియంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినట్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఘంటా చక్రపాణి, IIS డైరెక్టర్ ఆశిష్ గోయల్ తెలిపారు. అంబేడ్కర్ జీవితం మొత్తం కనులకు కట్టినట్లు ఎగ్జిబిషన్‌లో అద్భుతంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!