News March 28, 2025

SRPT: బకాయిదారుడి ఇంటి ముందు బైఠాయించిన అధికారులు

image

ఇంటి పన్ను చెల్లించడం లేదని మున్సిపల్ అధికారులు, సిబ్బంది బకాయిదారుడి ఇంటి ముందు బైఠాయించి వినూత్న నిరసన తెలిపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో గురువారం జరిగింది. స్థానిక శిశు మందిర్ స్కూల్ కాలనీకి చెందిన బానోత్ భీమ ఇంటి పన్ను చెల్లించకపోవడంతో పలుమార్లు నోటీసులు పంపించారు. అయినా పన్ను చెల్లించకపోవడంతో ఇలా బకాయిదారుడి ఇంటి ముందు కూర్చొని అధికారులు నిరసన తెలిపారు.

Similar News

News April 2, 2025

NZB: కవిత GHIBLI ఇమేజ్ చూశారా..

image

కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్నంగా ప్రశ్నించారు. ఆడ పిల్లలకు స్కూటీ ఇవ్వడంపై ఘిబ్లీ ఇమేజ్‌తో ఇంస్టాగ్రామ్‌లో ప్రియాంక గాంధీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రియాంక జీ, స్కూటీ ఎక్కడ ? అంటూ ఇంస్టాగ్రామ్‌లో స్కూటీ మీనియేచర్‌ని పట్టుకున్న ఘిబ్లీ ఇమేజ్‌ను కవిత పోస్ట్ చేశారు.

News April 2, 2025

మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

మయన్మార్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. కాగా భూకంపం ధాటికి మయన్మార్‌లో ఇప్పటికే 2,700 మందికిపైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. 4500 మందికిపైగా గాయాలపాలయ్యారు. మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. రోడ్లపైనే నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

News April 2, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 2, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.42 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!