News March 17, 2025
SRPT: మొట్టమొదటి MBBS డాక్టర్ రామకృష్ణారెడ్డి మృతి

కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ బీ.రామకృష్ణారెడ్డి ఆదివారం కోదాడలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతిచెందారు. కాగా, కోడాడకు మొట్టమొదటి MBBS డాక్టర్ ఈయనే. రామకృష్ణారెడ్డికి కోదాడ పరిసర ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన అమెరికాలో ఎండీ కోర్స్ పూర్తి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం: వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

ఖమ్మం జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ నిశితంగా పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లోని పోలింగ్ సరళిని వీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటింగ్ విధానంపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.
News December 17, 2025
ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ చూడొచ్చు

ఇకపై ఫోన్లలో ఇన్‌స్టా రీల్స్ చూస్తూ కళ్లు పాడుచేసుకునే భారం తగ్గిపోనుంది. Insta టీవీ యాప్‌ను విడుదల చేసింది. దీంతో పెద్ద స్క్రీన్‌పై రీల్స్, షార్ట్ వీడియోలను వీక్షించవచ్చు. ముందుగా USలోని సెలక్టెడ్ అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌పై దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భవిష్యత్తులో ఇతర టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌కు విస్తరించనున్నారు. TVలోనూ SM వినియోగం పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
News December 17, 2025
చెన్నారావుపేట: సెల్యూట్.. జయరాజ్ పోలీస్ అన్న!

చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.


