News April 12, 2025

SRPT రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్మెంట్ మొదలైన అంశాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఫిర్యాదులపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. SI బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.

Similar News

News April 13, 2025

కడప జిల్లాలో గత ఐదేళ్ల ఇంటర్‌ ఫలితాలు ఇవే..

image

☛ 2021 అకడమిక్‌ ఇయర్‌లో కరోనా కారణంగా 100 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
☛ 2022లో ఇంటర్‌ ఫస్టియర్ 41 శాతం.. సెకండియర్ 50 శాతం ఉత్తీర్ణత
☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత
☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత
☛ 2025లో ఫస్టియర్ 61 శాతం, సెకండియర్ 75 శాతం ఉత్తీర్ణత
కరోనా సమయంలో తప్ప ప్రతి ఏడాది కడప జిల్లా ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతూ పోతోంది.

News April 13, 2025

భీమవరంలో చికెన్ రేట్లు ఇలా.!

image

భీమవరం, పాలకోడేరు, వీరవాసరం మండలాలు చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ ధర రూ.800 నుంచి రూ .1000 మధ్యలో ఉంది. అలాగే చికెన్ కేజీ రూ. 240 – రూ.260 మధ్యలో ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News April 13, 2025

సిద్దిపేట: అదుపుతప్పిన కారు.. బాలుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండల పరిధి లకుడారం గ్రామ శివారులో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన రాయవరం బాబి కుటుంబ సమేతంగా వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా లకుడారం శివారులో మల్లన్నవనం సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి పల్టీలుకొట్టి బోర్లాపడింది. ఫలితంగా కార్తీక్(7) మరణించగా మిగతా నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు.

error: Content is protected !!