News November 6, 2025

SRSPకి తగ్గిన ఇన్‌ఫ్లో

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గింది. ఈరోజు ఉదయం ఇన్‌ఫ్లో 21,954 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 21,954 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో 12,500 క్యూసెక్కులు స్పిల్‌వే గేట్ల ద్వారా, 8,000 క్యూసెక్కులు ఎస్కేప్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నారు. అటు సరస్వతి కాలువ, మిషన్ భగీరథకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 4 గేట్లను తెరచి ఉంచారు. మొత్తం నీటినిల్వ 80.5 TMCగా ఉంది.

Similar News

News March 27, 2026

LPG స్థానంలో PNG గ్యాస్ వినియోగించండి: కలెక్టర్

image

కడప జిల్లాలో PNG ఉన్న ప్రాంతాల్లో LPGకి బదులుగా PNGకి బదిలీ కావాలని జిల్లా కలెక్టర్ చెరికూరి శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఎల్పీజీకి ప్రత్యమ్నయంగా పైపుడ్ నేచురల్ గ్యాస్ వినియోగించేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని, ఎల్పీజీ సరఫరా అటువంటి వారికి ఉండదన్నారు.

News March 26, 2026

భద్రాద్రిలో 8 అడుగుల ‘మహా అగర్బత్తి’

image

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఎదుర్కోలు, తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఆలయ ప్రాంగణంలో అంబికా దర్బార్‌బత్తి వారి 8 అడుగుల ‘మహా అగర్బత్తి’ని ప్రత్యేకంగా వెలిగించారు. రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నుంచి ప్రత్యేకంగా పంపిన ఈ అగర్బత్తి సుమారు 36 గంటల పాటు నిర్విరామంగా వెలుగుతూ సువాసనలు వెదజల్లుతుంది.

News March 26, 2026

జిల్లాలో పెట్రోల్, డీజిల్‌ కొరతలేదు: కలెక్టర్

image

NTR జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ లక్ష్మిశ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 176 పెట్రోల్ బంకులు సక్రమంగా పనిచేస్తున్నాయన్నారు. వదంతులను నమ్మి ప్రజలు అనవసరంగా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. క్యాన్లు, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లడం పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.