News July 29, 2024

SRSP అప్డేట్: 17,310 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో మెల్లగా పెరుగుతోంది. నిన్న 24 గంటల్లో 16,840 క్యూసెక్కుల నీరు రాగా సోమవారం ఉదయం 9 గంటలకు 17,310 క్యూసెక్కులకు పెరిగింది. ఔట్ ఫ్లోగా 644 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1075.3 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Similar News

News February 7, 2025

NZB: ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి: స్రవంతి

image

నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షలకు, ఫౌండేషన్ కోర్సులకు ఉచిత కోచింగ్ కోసం ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి కోరారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 9నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 12నుంచి 14వరకు ఉంటుందన్నారు. వివరాలకు 86390 02255ను సంప్రదించాలన్నారు.

News February 7, 2025

NZB: ఫారెస్ట్ అధికారి హత్య.. దోషికి జీవిత ఖైదు

image

నిజామాబాద్ జిల్లాలో 2013లో ఇందల్వాయి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గంగయ్య దారుణ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఆ కేసులో దోషిగా తేలిన భాస్కర్‌కు హైకోర్టు జీవిత కారాగార శిక్షను ఖరారు చేసింది. మిగతా 13 మందిని నిర్దోషులుగా పేర్కొన్నారు. కాగా 2017లో మొత్తం 17 మందిలో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News February 7, 2025

కోటగిరి: తల్లి, తనయుడు అదృశ్యం

image

కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన బండారి జ్యోతి(24) తన ఒకటిన్నర సంవత్సరాల కొడుకుతో అదృశ్యమైనట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బిడ్డతోపాటు వెళ్లిపోయింది. జ్యోతికి మాటలు రావని ఆచూకీ తెలిసినవారు కోటగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

error: Content is protected !!