News July 28, 2024

SRSP అప్డేట్: 26,510క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో శనివారం రాత్రి 10 గంటలకు 26,510 క్యూసెక్కులకు తగ్గింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 35,078 క్యూసెక్కుల నీరు రాగ సాయంత్రం 6 గంటలకు అది 30,554 క్యూసెక్కులకు తగ్గిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1074.30 అడుగుల నీరు నిల్వ ఉంది.

Similar News

News February 23, 2026

NZB: అందరి సహకారంతో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

image

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల ఎన్నికలు సాఫీగా ముగిసిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల విధుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులను కలెక్టర్ సన్మానించారు.

News February 23, 2026

NZB: లైసెన్స్‌‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు అందజేత

image

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.

News February 23, 2026

NZB: డెస్క్ జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ ఇవ్వాలి: DJFT

image

మీడియాలో పని చేసే ప్రతి డెస్క్ జర్నలిస్ట్‌కు అక్రిడిటేషన్ ఇవ్వాలని డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (DJFT) నాయకులు కోరారు. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రతి డెస్క్ జర్నలిస్ట్‌కు ప్రభుత్వం అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అక్రిడిటేషన్ జిల్లా కమిటీలో డెస్క్ జర్నలిస్ట్‌లను నియమించాలని కోరారు. ప్రతి జిల్లాలో 5 అక్రిడిటేషన్‌లు ఇవ్వాలని కోరారు.