News August 27, 2024

SRSP అప్డేట్.. 58.709 TMCలకు చేరిన నీటిమట్టం

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.5TMC)గాను మంగళవారం రాత్రి 7 గంటలకు 1084.6 అడుగులకు (58.709 TMC) నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా 24,014 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోందని ఔట్ ఫ్లోగా 4,459 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు.

Similar News

News November 21, 2025

ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి నిజామాబాద్ రచయితకు ఆహ్వానం

image

ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి NZB జిల్లాకు చెందిన రచయిత ప్రేమ్ లాల్‌ ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి పిలుపు రావడం పట్ల ప్రేమ్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. సాహితీ మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

News November 21, 2025

NZB: గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: TPCC చీఫ్

image

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్-2025లో NZBకు చెందిన నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడా గౌరవాన్ని మరోసారి ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

News November 21, 2025

SRSP: 947.474 TMCల వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్‌గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.