News April 14, 2025
SRSP సాగునీటి విడుదల నిలిపివేత

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. యాసంగి పంట కాలం పూర్తి కావడంతో నీటి విడుదల సోమవారం నిలిపివేసినట్లు డ్యామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి ఈ నెల 9 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.44 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.
Similar News
News April 16, 2025
NZB: ‘అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు’

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజికమాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్ధేశంతో కొందరు సామాజికమాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
News April 16, 2025
NZB: శని పుత్రుడు పోచారం: జీవన్ రెడ్డి

బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు. బాన్సువాడలో మంగళవారం జరిగిన BRS రజతోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాసరెడ్డిని CM కేసీఆర్ లక్ష్మీ పుత్రుడు అని ప్రేమగా పిలిచేవారన్నారు. అయితే ఆయన లక్ష్మీ పుత్రుడు కాదని, శని పుత్రుడు అని ఎద్దేవా చేశారు.
News April 16, 2025
నిజామాబాద్ జిల్లా జడ్జీ సునీతా కుంచాల బదిలీ

నిజామాబాద్ జిల్లా జడ్జిగా పని చేస్తున్న సునీతా కుంచాల బదిలీ అయ్యారు. ఆమె పెద్దపల్లి జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు నూతన జడ్జిగా జీవీఎన్ భరతలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని లేబర్ కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఈ మేరకు బదిలీలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.