News April 14, 2025
SRSP సాగునీటి విడుదల నిలిపివేత

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. యాసంగి పంట కాలం పూర్తి కావడంతో నీటి విడుదల సోమవారం నిలిపివేసినట్లు డ్యామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి ఈ నెల 9 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.44 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.
Similar News
News April 15, 2025
ఆర్మూర్: చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్‌లో జరిగింది. CI సత్యనారాయణ తెలిపిన వివరాలు.. ఆలూరు రోడ్‌కు చెందిన కుంట గంగామోహన్ రెడ్డి(65) సోమవారం సాయంత్రం బట్టలు ఉతికేందుకు గుండ్ల చెరువుకి వెళ్లాడు. అనంతరం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News April 15, 2025
NZB : డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కమిషనర్

నాగారంలోని డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో సోమవారం రాత్రి యార్డును నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సెక్యూరిటీ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొగ కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలుగుతోందని అక్కడి కాలనీవాసులు ఆదివారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
News April 15, 2025
KMR: కుమారుని పెళ్లి.. తండ్రి మృతి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివయ్య పల్లి గ్రామంలో సోమవారం కుమారుడి వివాహ వేడుకల్లో తండ్రి మృతి చెందడం కలకలం రేపింది. గజ్జెల వెంకటి(57) అతని కుమారుని పెళ్లి వేడుకలో ఫంక్షన్ హాల్‌లో పని చేస్తుండగా 11KV విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుష్పరాజు తెలిపారు.