News October 21, 2024

SRSP 17 గేట్లు ఎత్తివేత

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అదనపు నీరు వస్తుండడంతో ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టు అధికారులు మొత్తం 17 గేట్లు ఎత్తారు. వీటి ద్వారా 53,108 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుండి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 67,562 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను తాజాగా 1091అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉంది.

Similar News

News November 10, 2024

ధాన్యం అమ్మాలంటే కష్ట పడాల్సిందే..!

image

భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.

News November 10, 2024

KMR: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

image

ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్ మండలంలో జరిగింది. ఎస్సై రంజిత్ కథనం ప్రకారం.. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన మొగ్గం శ్రావణ్ (24) కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

News November 9, 2024

రామారెడ్డి: బావిలో పడి వ్యక్తి మృతి

image

కాలు జారి బావిలో పడిన వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలంలో జరిగింది. ఏఎస్ఐ లచ్చిరాం వివరాలిలా .. మండలంలోని రెడ్డి పేట గ్రామ వాసి బొల్లారం ఎల్లయ్య శుక్రవారం బావి వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడి గల్లంతయ్యాడు. శనివారం శవమై నీటిపై తేలాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.