News October 10, 2025
SRSP: 24 గంటల్లో 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.053 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
Similar News
News October 10, 2025
బాణసంచా తయారీలో నిభందనలు పాటించాలి: ఎస్పీ

దీపావళి పండుగతో పాటు ఇతర వేడుకల సందర్భంగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయం వంటి కార్యకలాపాలు నిర్వహించే వారు ప్రభుత్వ నిబంధనలు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విక్రయ కేంద్రాలపై తనిఖీలు జరుగుతాయన్నారు. నిభందనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News October 10, 2025
HYD: యువతి సూసైడ్.. ఈ యువకుడిపై అనుమానం

లాలాపేట PS పరిధి రైల్వే డిగ్రీ కాలేజీ విద్యార్థి మౌనిక(20) సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. MKనగర్‌లో నివాసం ఉండే అంబాజీ(వాలీబాల్ కోచ్) మీద మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల మీద నమ్మకం ఉందని, నిజాలు తేల్చుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వాలీబాల్ కోచ్ వేధింపులే ఆమె సూసైడ్‌కు కారణమని మౌనిక స్నేహితులు చెప్పారు. కోచ్‌కు కాలేజీకి సంబంధం లేదని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు.
News October 10, 2025
నెలసరి సెలవు.. మన దగ్గరా ఉండాలంటూ పోస్టులు!

కర్ణాటక ప్రభుత్వం నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందిని గుర్తించి నెలకు ఒకరోజు చొప్పున ఏడాదికి 12 రోజులు పెయిడ్ లీవ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. రుతుక్రమంలో తొలిరోజు లేచి నడిచేందుకూ తాము ఇబ్బంది పడతామని, దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు దీన్ని అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని CMలకు కోరుతున్నారు. మీ కామెంట్?