News August 18, 2025

SRSP 39 గేట్లు ఓపెన్!

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు 39 గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. తద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1,25,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1089.1 అడుగుల(73.749 TMC) నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News August 18, 2025

హార్ట్‌ఎటాక్‌ను 12ఏళ్ల ముందే గుర్తించొచ్చు!

image

గుండెపోటు సంభవించడానికి పుష్కరం ముందే కొన్ని సంకేతాలు వస్తాయని అమెరికా హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఏటా ఓపిక తగ్గుతూ ఉంటే మీ గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం. ‘5KMPH వేగంతో నడవటానికీ ఇబ్బందిపడటం. చిన్న పనులు, వ్యాయామం చేసినా త్వరగా అలసిపోవడం, ఊపిరి ఆడకపోవడం’ వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి. వేగంగా నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

News August 18, 2025

నష్టంపై నివేదికలు సిద్ధం చేయండి: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై విభాగాల వారీగా పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పర్యటనపై సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.

News August 18, 2025

KNR: కోటగిరి గట్ల వైభవం.. నేటికీ సజీవం!

image

KNR జిల్లా సైదాపూర్ మం. సర్వాయిపేట కోటగిరి గట్లలోని చారిత్రక కట్టడాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. కొత్త, పాత ఖిల్లాలు, బలిష్టమైన రాతిగోడలు, రహస్య సొరంగాలు, బయ్యన్న విగ్రహం, చెరువులు, ఆలయాలు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను చాటుతున్నాయి. కోనేర్లు, కందకాలు, హనుమాన్, శివాలయాలు, ఎల్లమ్మగుడి నిర్మాణాలు ఆనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పాపన్న నిర్మించిన బయ్యన్న, సర్వమ్మ, ఎల్లమ్మ చెరువులు ఇప్పటికీ ఉన్నాయి.