News November 3, 2024
SRSP UPDATE: నిలకడగా నీటి మట్టం

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం నిలకడగా ఉంది. ఆదివారం ఉదయం ఎగువ నుండి ఇన్ ఫ్లోగా 4,787 క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ఇందులో కాకతీయ కెనాల్ కు 2883, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను తాజాగా 1091అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 16, 2025
ఆర్మూర్: ఎన్నికలు జరగనున్న సర్పంచ్ స్థానాలు 146

ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోగల గ్రామాలలో రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 3వ విడత పోలింగ్ జరగనుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికలు జరగనున్న సర్పంచ్ స్థానాలు:146
పోటీలో ఉన్న అభ్యర్థులు: 562
ఓటర్ల సంఖ్య: 3,06,795
పోలింగ్ కేంద్రాలు: 1490
News December 16, 2025
NZB: 60 సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్ఠమైన నిఘా: CP

తుది విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలలో ఉన్న 60 సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. 24 ఎఫ్.ఎస్.టీ టీమ్స్, 4 ఎస్.ఎస్.టీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో మొత్తం 194 మందిని సంబంధిత తహశీల్దారుల ముందు హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు వివరించారు.
News December 16, 2025
నిజామాబాద్: ఎన్నికలు.. 11 గన్లు డిపాజిట్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల వద్ద ఉన్న గనులను డిపాజిట్ చేయాల్సిందిగా సీపీ సాయి చైతన్య ఆదేశించారు. మొత్తం 18 మంది వద్ద గన్ లైసెన్స్లు ఉండగా వారిని డిపాజిట్ చేయమన్నామన్నారు. ఇందులో నుంచి 11 గన్లు తమవద్ద డిపాజిట్ అయ్యాయని, మిగతా 7 గన్ లైసెన్సులు బ్యాంకుకు సంబంధించినవని కమిషనర్ వివరించారు.


