News August 20, 2025

SRSP UPDATE.. 16 గేట్లు OPEN

image

ఎగువ నుంచి వరద నీటి ఇన్‌‌ఫ్లో తగ్గడంతో అధికారులు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను బుధవారం మధ్యాహ్నం మరో 9 గేట్లు మూసివేశారు. మ.12 గంటలకు 25 గేట్ల ద్వారా నీటిని వదిలిన అధికారులు, మధ్యాహ్నం 3 గంటలకు 16 గేట్ల ద్వారా నీటిని వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎగువ నుండి 2,07, 560 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 81,867 క్యూసెక్కులు వదులుతున్నారు. తాజాగా ప్రాజెక్టులో 69.19TMCల నీరు నిల్వ ఉంది.

Similar News

News April 8, 2026

అనకాపల్లి: ‘అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కరించాలి’

image

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సేవలలో పారదర్శకత, సమయపాలన పాటించాలన్నారు. నాలుగవ విడత జిల్లాలో జరుగుతున్న భూసర్వేను వేగవంతం చేయాలన్నారు. సమస్యలపై కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

News April 8, 2026

మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఈరోజు తన చాంబర్లో మాతా శిశు మరణాలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణీల్లో రక్తహీనత ఉన్న వారిని గుర్తించే వారికి ముందస్తుగా పోషకాహారం అందించి, ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 8, 2026

కామారెడ్డి జిల్లాలో నూతన డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యేనా?

image

జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా దోమకొండ, గాంధారి మండల కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాలని పలు విద్యార్థి, ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. మారుమూల ప్రాంతాలైన మద్నూర్, జుక్కల్‌లో సైతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ప్రజాప్రతినిధులు మంజూరు చేయిస్తారో.. లేదో చూడాలి..!