News October 27, 2024

SRSP UPDATE: 2 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అదనపు నీరు వస్తుండడంతో అధికారులు ఆదివారం సాయంత్రం 2 గేట్ల ఎత్తారు. దీని ద్వారా 6,248 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 15,702 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను తాజాగా 1091 అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 10, 2024

పిట్లం: భానుడు.. చెరువులో విద్యుత్ వెలుగులా..!

image

సాయంత్రం వేళ సూర్యాస్తమయ సమయాన సూర్యుడి ప్రతిబింబం చెరువు నీటిలో విద్యుత్ బల్బు మాదిరి సాక్షాత్కరించింది. ఆకాశమంతా ఎర్రని కాంతులను వెదజల్లుతూ.. మరో వైపు నీటిలో దీప కాంతిని ప్రసరిస్తూ కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. పిట్లంలోని గ్రామ చెరువు వద్ద శనివారం ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించారు.

News November 10, 2024

ధాన్యం అమ్మాలంటే కష్ట పడాల్సిందే..!

image

భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.

News November 10, 2024

KMR: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

image

ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్ మండలంలో జరిగింది. ఎస్సై రంజిత్ కథనం ప్రకారం.. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన మొగ్గం శ్రావణ్ (24) కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.