News November 6, 2025
SRSP UPDATE: 21,954 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 21,954 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఉదయం 9 గంటలకు 4 గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు వెల్లడించారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News November 6, 2025
HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News November 6, 2025
వనపర్తి: ప్రతి నెల గ్రామసభలు నిర్వహించాలి

గ్రామస్థాయి అధికారులు ప్రతినెల గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి తరుణ్ సూచించారు. గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామ సభల ద్వారా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని ఆయన సూచించారు.