News December 23, 2024

SSA ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. హనుమకొండలో దీక్ష చేస్తున్న SSA ఉద్యోగులను ఆయన కలిశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తాము రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, రూ.7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Similar News

News December 7, 2025

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకుంటున్నారా?

image

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకోవడం ఆరోగ్యానికి మేలు కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వలన చలి తీవ్రత పెరగడమే కాకుండా గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చల్లగాలి శరీరాన్ని తాకితే ఉదయం నిద్రలేవగానే కండరాల బలహీనత ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసి నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిపై ప్రభావితం చూపిస్తుందంటున్నారు.

News December 7, 2025

జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

image

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్‌‌లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

News December 7, 2025

వేసవిలో స్పీడ్‌గా, చలికాలంలో స్లోగా కదులుతున్న హిమానీనదాలు

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీనదాలు వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా కదులుతున్నట్లు నాసా గుర్తించింది. దశాబ్దం పాటు సేకరించిన శాటిలైట్ డేటా ఆధారంగా 36 మిలియన్లకుపైగా ఫొటోలను పరిశీలించి జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. 5 sq.km కంటే పెద్దవైన హిమానీనదాల ఫొటోలను పోల్చి కాలానుగుణంగా వాటి కదలికలను గుర్తించారు. ఫ్యూచర్‌లో హిమానీనదాల కరుగుదల అంచనాలో కదలికలు కీలకం కానున్నాయి.