News January 16, 2026

SSC కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్

image

సాయుధ బలగాల్లోని 8 విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి SSC నిర్వహించిన కానిస్టేబుల్ జీడీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 53,690 పోస్టుల ఎంపికకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్‌‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. గతేడాది ఫిబ్రవరిలో CBT నిర్వహించగా 24లక్షల మంది పాల్గొన్నారు. జూన్‌లో PET, PST, ఆగస్టు నుంచి SEP వరకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించారు. అఫీషియల్ <>వెబ్‌సైట్‌<<>>లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News February 16, 2026

SRPT:యాప్‌లో బుక్ చేసుకునేలోపే ‘నో స్టాక్’

image

సూర్యాపేట జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. సాగుకు 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అందుబాటులో లేవనే ఫిర్యాదులు అందుతున్నాయి. యాప్‌లో బుక్ చేసుకునేలోపే ‘నో స్టాక్’ అని వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 62 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ, తమకు మాత్రం దొరకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

News February 16, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,43,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 16, 2026

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140+ పాయింట్ల లాభంతో 82,768 వద్ద కదలాడుతోంది. అటు నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,515 వద్ద ఊగిసలాడుతోంది.