News June 14, 2024

SSC కానిస్టేబుల్.. 20,471 పోస్టులు పెంపు

image

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)-2024 ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను 46,617కు పెంచింది. 2023లో 26,146 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, 2024 ఫిబ్రవరి-మార్చిలో పరీక్షలు జరిగాయి. తాజాగా 20,471 పోస్టులను పెంచింది. అత్యధికంగా CISFలో 13,632, BSFలో 12,076, CRPFలో 9,410, ITBPలో 6,287 ఖాళీలు ఉన్నాయి. త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి. ssc.gov.in/

Similar News

News December 25, 2024

అల్లు అర్జున్ కేసు: AP vs TG రంగు కరెక్టేనా?

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట రాజకీయ రంగు పులుముకుంటోంది. కేసులో ప్రధాన నిందితులపై కాకుండా A11 అల్లు అర్జున్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అర్జున్ VS పోలీసులు, అర్జున్ VS రేవంత్‌గా కొనసాగిన నెరేటివ్ ఇప్పుడు AP VS TGగా మారింది. కొందరు కాంగ్రెస్ నేతలు, MLAలు ఆంధ్రావాళ్ల పెత్తనం ఇక్కడేంది? కావాలంటే వెళ్లిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆ పార్టీ వైఖరిపై సందేహాలు కలుగుతున్నాయి. మరి మీరేమంటారు?

News December 25, 2024

మోహన్ బాబుకు మరోసారి నోటీసులు?

image

TG: జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు ఇంకా అజ్ఞాతం వీడలేదని తెలుస్తోంది. అరెస్టు నుంచి మినహాయిస్తూ హైకోర్టు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియగా నేడు ఆయన పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడి కేసులో మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు.

News December 25, 2024

ఆ స్కూళ్లకు 29 వరకు సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు మరికొన్ని రోజులు సెలవులు ఉండనున్నాయి. ఏపీలో ఈ నెల 29 వరకు, తెలంగాణలో 27 వరకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో మిగతా అన్ని స్కూళ్లకు రేపు కూడా సెలవు ఉండగా, ఏపీలో ఆప్షనల్ హాలిడే ఉంది. దీని ప్రకారం కొన్ని పాఠశాలలు గురువారం కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.