News June 15, 2024

SSC ఎగ్జామినేషన్ క్యాలెండర్ విడుదల

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2024-25 ఎగ్జామినేషన్ <>క్యాలెండర్<<>> విడుదలైంది. CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్, కానిస్టేబుల్ లాంటి ముఖ్యమైన పోస్టుల పరీక్ష తేదీలను SSC ప్రకటించింది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రారంభ, చివరి తేదీలను పేర్కొంది. పూర్తి వివరాలకు https://ssc.gov.in/for-candidates/examination-calendar సైట్ చూడండి.

Similar News

News December 26, 2024

కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?

image

TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.

News December 26, 2024

బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

image

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.

News December 26, 2024

సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.