News January 28, 2025
SSC GD ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటించిన 39,481 జనరల్ డ్యూటీ(GD) కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష తేదీలు, అప్లికేషన్ స్టేటస్ వివరాలను SSC ప్రకటించింది. ఈ నెల 31న అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది. ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో షిఫ్టుల ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు <
Similar News
News November 25, 2025
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

ఐబొమ్మ రవి కస్టడీలో సహకరించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. మొత్తం ఆయనపై 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్క కేసులో రిమాండ్ విధించారని, మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇవాళ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు.
News November 25, 2025
తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్నెఫ్ట్, ల్యూకోయిల్పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.
News November 25, 2025
మహిళలకు మెగ్నీషియం ఎంతో ముఖ్యం

శరీరానికి ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 300 మి.గ్రా మెగ్నీషియం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లు, ఎముకల ఆరోగ్యం, ఋతుస్రావం, ప్రెగ్నెన్సీ వంటి అన్ని దశల్లో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. గుమ్మడి గింజలు, బచ్చలికూర, బాదం, జీడిపప్పు, పాలు, డార్క్ చాక్లెట్, చిక్కుడు, అవకాడో, పప్పు దినుసులు, అరటిపండు, సోయాపాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.


