News January 29, 2025

SSMB29: ప్రియాంకకు భారీ రెమ్యునరేషన్?

image

మహేశ్-రాజమౌళి #SSMB29 సినిమాకు ప్రియాంకా చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారన్న టాక్ నడుస్తోంది. నిజమైతే భారత హీరోయిన్లలో ఇది రికార్డ్ రెమ్యునరేషన్ అయ్యే అవకాశం ఉంది.

Similar News

News December 1, 2025

శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత లడ్డూ ప్రసాదం

image

శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పథకం ప్రారంభం కానుంది. అతిశీఘ్ర దర్శనం (రూ.300) టికెట్ కొనుగోలు చేసిన వారికి ఒక లడ్డూను, స్వామివారి స్పర్శ దర్శనం (రూ.500) టికెట్ దారులకు రెండు లడ్డూలను ఉచితంగా అందజేస్తారు. అలాగే, డొనేషన్ కౌంటర్, ఛైర్మన్ ఛాంబర్, కైలాస కంకణాల కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, శ్రీగోకులం ఆధునికీకరణ పనులకు భూమి పూజ చేయనున్నారు.

News December 1, 2025

నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుంది. ఇవాళ ఉమ్మడి MBNRలోని మక్తల్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. CM రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

News December 1, 2025

ఆలోచనలను ఆదాయ వనరుగా మార్చారు

image

2014లో నాలుగు ఆవుల్ని కొన్న శ్రీకాంత్, చార్మి దంపతులు అహ్మదాబాద్‌లో వాటిని పెంచుతూ తొలుత పాలు, నెయ్యి, పనీర్ అమ్మారు. ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మలచుకోవాలనుకున్నారు. ఆవుల సంఖ్య పెంచి ‘గౌనీతి ఆర్గానిక్’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పాలు, నెయ్యి, పన్నీరుతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటి వద్దనే అమ్మడం ప్రారంభించారు.