News December 10, 2024

రెండు పార్టులుగా SSMB29.. రూ.వెయ్యి కోట్ల బడ్జెట్!

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న SSMB29 రెండు పార్టులుగా ఉంటుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే నెలలోనే సినిమా ప్రారంభమవుతుందని PINKVILLA పేర్కొంది. అయితే, మహేశ్ పాత్ర హిందూ పురాణాలు, హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిన క్యారెక్టర్‌గా ఉండొచ్చని తెలిపింది. ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం.

Similar News

News January 19, 2026

మీ షూ కీళ్లను దెబ్బతీస్తున్నాయా?

image

షూ ఎంచుకునేటప్పుడు కేవలం లుక్స్ మాత్రమే చూస్తాం. కానీ రాంగ్ ఫుట్‌వేర్ వల్ల మోకాళ్లు, నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. ముంబై డాక్టర్ మనన్ వోరా ప్రకారం.. మరీ ఫ్లాట్ షూ కాకుండా Slight Heel ఉన్నవి వాడాలి. ఇవి కీళ్లపై ప్రెజర్ తగ్గిస్తాయి. రన్నింగ్‌కు కుషనింగ్ ఉన్న షూ, జిమ్ వర్కౌట్స్‌కు ఫ్లాట్ సోల్ బెస్ట్. మీ Arch typeని బట్టి కరెక్ట్ సైజులో ఉండేలా చూసుకోవాలి. స్టైల్ కోసం హెల్త్ రిస్క్ చేయొద్దు.

News January 19, 2026

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

image

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్‌ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు ఉ.11 గంటలకు ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు సమాచారం.

News January 19, 2026

WOW.. వైర్లు లేకుండానే విద్యుత్ సరఫరా!

image

వైర్లు లేకుండానే గాలిలో కరెంట్‌ను పంపి ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. హెల్సింకి, ఔలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు, లేజర్ కిరణాల సహాయంతో విద్యుత్తును ఒక చోటు నుంచి మరోచోటుకు విజయవంతంగా పంపారు. ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ‘అకౌస్టిక్ వైర్’ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్‌లో ప్లగ్‌, వైర్ల అవసరం తగ్గుతుంది. Wi-Fi లాగే రేడియో తరంగాల ద్వారా పరికరాలకు విద్యుత్ సరఫరా అందనుంది.