News February 5, 2025
SSMB29: ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదా.. విలనా?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఆమె విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్. కాగా ఈ మూవీ కోసం కాశీలో ఉండే మణికర్ణికా ఘాట్ తరహాలో హైదరాబాద్‌లో సెట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News March 28, 2026
పాండ్య ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చారా?

ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందికి హార్దిక్ పాండ్య రివార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేసినట్లు ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమని ఒక్కొక్కరికి రూ.10వేల చెక్కు ఇచ్చారని నేషనల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం పాండ్య వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశారు. తనకు సహకరించిన గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు ఇస్తానని అప్పుడే మాట ఇచ్చారు.
News March 28, 2026
ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల కలిగే లాభాలు

వంటల్లో ఆలివ్ ఆయిల్ చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఆలివ్స్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండెకు మేలుచేసే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యంతో పాటు కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సాయపడతాయని పలు సర్వేలు తేల్చాయి. జీర్ణ వ్యవస్థతోపాటు చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.
News March 28, 2026
ఇంటి బాల్కనీలో ఈ మొక్కలు పెంచండి

ఇంటి గాలిని శుభ్రపరిచేందుకు సహజసిద్ధమైన మార్గం మొక్కలే. మన బాల్కనీలో పెంచుకునే లావెండర్, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ, కలబంద వంటివి గాల్లోని విషతుల్యాలను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. ముఖ్యంగా మల్లె, రోజ్‌మేరీ, పుదీనా వెదజల్లే సువాసనలు మనసుకు ఉల్లాసాన్నిచ్చి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మేలు చేసే తులసి, బంతి ఉంటే మనలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది.


