News March 22, 2025
SSR-దిశ డెత్ కేసు: మాజీ CM కుమారుడి టెన్షన్

SSR-దిశా సాలియాన్ డెత్ కేసుల్లో మహారాష్ట్ర మాజీ CM ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, MLA ఆదిత్య ఠాక్రే చక్రవ్యూహంలో చిక్కుకున్నారు. దిశది సూసైడ్ కాదని, మర్డర్ చేశారని తండ్రి సతీశ్ ఆరోపిస్తున్నారు. 2020, JUNE 8న ఆమె మరణించినప్పుడు తనను కొందరు మెంటల్ కస్టడీలోకి తీసుకొని నోరు మూయించారని చెప్పారు. ఆదిత్యకు కేసుతో సంబంధం ఉందని, ఆయన సాక్ష్యాధారాలను మాయం చేశారని ఆరోపించారు. ఆ రోజు ఎక్కడున్నారో ఆదిత్య చెప్పడం లేదు.
Similar News
News March 23, 2025
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు టికెట్ల విడుదల

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్) కోటా, వసతి టికెట్ల కోటా విడుదల తేదీని ప్రకటించింది. రేపు ఉదయం 10గంటల నుంచి దర్శనం టికెట్లు, రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి వసతి టికెట్ల బుకింగ్ను ఓపెన్ చేయనుంది. ముందుగా రూ.300 టికెట్లు లేదా ఇతర దర్శనం టికెట్లు పొందినవారికి మాత్రమే వసతి గదుల బుకింగ్ సదుపాయం లభిస్తుంది.
News March 23, 2025
BJP మెడలు వంచి తీరుతాం: కేటీఆర్

TG: బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచి, దక్షిణాదిలో తగ్గించే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ మెడలు వంచైనా ఇక్కడ సీట్లు పెంచుకుంటామని చెప్పారు. ‘డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సౌత్ స్టేట్స్ ఏం తప్పు చేశాయి? జనాభా నియంత్రణ పాటించినందుకా ఈ శిక్ష? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News March 23, 2025
వచ్చే నెలలో కెనడాలో ఎన్నికలు

కెనడాలోని 338 పార్లమెంటు స్థానాలకు వచ్చే నెల 28న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త ప్రధాని కార్నీ త్వరలోనే ప్రకటన విడుదల చేయొచ్చని తెలుస్తోంది. కొత్త నాయకత్వం వచ్చాక అధికార లిబరల్ పార్టీవైపు ప్రజామోదం ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పీఎం కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు సమాచారం.