News February 24, 2025

SSS: కలెక్టర్ కార్యాలయానికి 233 అర్జీలు

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 233 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు మండలాల నుంచి సమస్యలపై కలెక్టర్‌కు ప్రజలు అర్జీలు ఇచ్చారు. పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు సమగ్ర విచారణ జరిపి సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.

Similar News

News July 11, 2025

HYD: AI డేటా సైన్స్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సుల్లో శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మణికొండలోని అకాడమి డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. వందకుపైగా కంప్యూటర్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం అన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News July 11, 2025

GNT: నేడు విచారణకు హాజరు కానున్న అంబటి

image

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు శుక్రవారం విచారణ నిమిత్తం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరు కానున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ కోసం నేడు అంబటి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు.

News July 11, 2025

మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.