News April 1, 2025

SSS: జిల్లా ప్రత్యేక అధికారిని కలిసిన కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా ప్రత్యేక ఐఏఎస్ అధికారి హరినారాయణను కలెక్టర్ చేతన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం పెనుకొండలోని సబ్ కలెక్టర్ బంగ్లాలో ఆయనను కలిసి పూలగుత్తి ఇచ్చారు. ప్రభుత్వం హరినారాయణను జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది. దీంతో ఆయన మొదటిసారిగా జిల్లాకి రావడంతో చేతన్ ఆయనను కలిసి జిల్లాని అభివృద్ధి బాటలో పయనింపచేయడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించారు.

Similar News

News November 28, 2025

గజ్వేల్: సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా తూంకుంట

image

సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన నేత మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి. వర్గల్ మండల కేంద్రం సర్పంచ్‌గా మొదటగా నర్సారెడ్డి పనిచేశారు. అనంతరం వర్గల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఉమ్మడి మెదక్ డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేసిన ఆయన 2009లో అసెంబ్లీ పునర్వ్యవస్థీకరణలో రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ గా మారడంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేశారు.

News November 28, 2025

MBNR: సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఫొటో, క్యాస్ట్, నోడ్యూస్, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ జత చేయాలి. అఫిడవిట్ లో అభ్యర్థి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. డిపాజిట్ అమౌంట్ (SC, ST, BCలకు రూ.1,000, జనరల్ కు రూ.2,000) చెల్లించాలి. “Expenditure declaration” సమర్పించాలి. అవసరమైన వారికి #SHARE IT.

News November 28, 2025

GNT: కొంపముంచిన నాటువైద్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి

image

మేడికొండూరు(M) పేరేచర్లలో ఇంటర్ విద్యార్థిని(16) నాటువైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న బాలికకు, స్థానికుల సలహాతో ‘కొండపిండి ఆకు’ తినిపించారు. నాటు మందు కారణంగా కడుపునొప్పి తీవ్రమవ్వడంతో వెంటనే గుంటూరు GGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున బాలిక మృతి చెందింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.