News January 11, 2026
SSS: డెడ్ బాడీని పీక్కుతిన్న జంతువులు..?

పుట్టపర్తి – నారాయణపురం రైల్వే స్టేషన్ల మధ్య కొత్తచెరువు (M) లోచర్ల సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఓ పురుషుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడికి సుమారు 50-60 ఏళ్ల వయసుంటుందన్నారు. అతని ఎత్తు 5.6 అడుగులు ఉన్నాడన్నారు. అతణ్ని అడవి జంతువులు పీక్కు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు.
Similar News
News January 13, 2026
670 సార్లు అప్లై చేసినా పట్టించుకోలేదు.. కట్ చేస్తే..

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కంటే తెలివితక్కువ పని ఇంకోటి లేదంటున్నారో టెకీ. ‘రిక్రూటర్లకు 670 అప్లికేషన్లు, 1000 మెసేజ్‌లు పంపినా పట్టించుకోలేదు. దీంతో దరఖాస్తులు ఆపేశా. వ్యక్తిగతంగా ప్రొడక్ట్ బిల్డింగ్, కంటెంట్ క్రియేషన్, నెట్‌వర్కింగ్‌పై ఫోకస్ చేశా. జనవరి-మే మధ్య 83మంది రిక్రూటర్లు సంప్రదించారు’ అని మర్మిక్ పటేల్ అనే వ్యక్తి తెలిపారు. మెటాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు.
News January 13, 2026
పెద్ద చింతరేవులలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ధరూర్ మండలం పెద్దచింతరేవుల గ్రామంలో ఆంజనేయస్వామి జాతర సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే ఈ పోటీలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని నిర్వాహక కమిటీ సభ్యులు కోటిరెడ్డి, హనుమంతు, రాము, వీరేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కబడ్డీ జట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
News January 13, 2026
నల్గొండ: ‘చిట్టిమల్లు’ రేపిన పల్నాటి యుద్ధం..!

పల్నాటి యుద్ధం.. తెలుగు వాళ్లకు పేరిన్నిక గల యుద్ధం. ఈయుద్ధానికి కారణం ఓ కోడి పుంజు అని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పుంజే చిట్టిమల్లు. ఒకప్పుడు పల్నాడులో రాజ్యాల మధ్య ఆధిపత్య, ఆక్రమణల కుట్రలు సాగాయి. నాయకురాలు నాగమ్మ కోడిపై గెలవడం కోసం బ్రహ్మనాయుడు మహిమ గల కోడి కోసం ఆరా తీస్తాడు. ఆనాడు శక్తిమంతమైన చిట్టిమల్లుగా పిలిచే పుంజును కుందూరు చోడుల రాజధానిగా ఉన్న మన NLG పానగల్లు నుంచే తీసుకెళ్లారు.


